భవిష్యత్తును ఊహించి.. సమాజాన్ని తట్టిలేపేదే జర్నలిజం..
1 min read– సమాజానికి దిక్సూచి పాత్రికేయ రంగం..
– జాతీయ పత్రికా దినోత్సవంలో ఎమ్మెల్యే ఆర్థర్
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: భవిష్యత్తును ఊహించి సమాజాన్ని తట్టిలేపేదే జర్నలిజమని , సమాజానికి దిక్సూచి పాత్రికేయ రంగమని, సమాజ పున నిర్మాణమే లక్ష్యంగా పాత్రికేయులు ముందుకు సాగాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పేర్కొన్నారు.నందికొట్కూరు లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ తమ రచనలతో అనుభవించే వారికి జర్నలిజం బ్రహ్మాండమైన వృత్తి అన్నారు. నిత్యం అద్భుతాలు సృష్టించే అవకాశం ఇందులోనే ఉందన్నారు. ప్రతినిత్యం సమాజాన్ని ముందుకు నడిపించే చోదక శక్తులుగా ఉండే ఇలాంటి వృత్తిలో భాగస్వాములైనందుకు గర్వపడాలన్నారు. పోటీ ప్రపంచంలో ముందుండాలనే తపన ప్రత్యేక గుర్తింపు తెస్తుందని సూచించారు. ఇబ్బందులు ప్రతి ఒక్కరికీ రావడం సహ జమని, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని కోరుకోవాలన్నారు. సమస్యలను గట్టిగా ఎదిరించగలిగేవాడే వీరుడన్నారు. ‘మీలో ఒక్కడిగా నన్ను చూసుకుంటూ అను నిత్యం తోడ్పాటు, ప్రోత్సాహం, అభిమానం, ప్రేమ, ఆదరణ చూపుతున్నందుకు మీ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పు డు వచ్చినా తీర్చుకుంటానన్నారు.
పాత్రికేయులకు ఇళ్ల పట్టాలు, నిర్మాణాలు, వంటివాటని ప్రభుత్వం నుంచి ఇప్పించేందుకు ముందుంటానన్నారు. పత్రికా భాషలో ఎన్నో మార్పులొచ్చాయని.. వ్యవహారిక భాషలో పత్రికలు ముద్రణ ప్రారంభించడంతో సామాన్యుడు కూడా పత్రికలకు దగ్గరయ్యాడన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన వారి వెనుక జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. అలాగే కలం అదుపులో ఉన్నంతవరకు సమాజానికి ప్రమాదం ఉండదన్నారు. కలం అదుపు తప్పితే వరదలా పొంగి సమాజాన్ని నాశనం చేసే ప్రమాదం ఉందన్నారు.కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రమాదేవి, ఉర్దూ అకాడమీ రాష్ట్ర డైరెక్టర్ షూకురు మియ్య, సింగిల్ విండో చైర్మన్ బాలస్వామి, వైసీపీ నాయకులు జగన్ రఫీ , సుబ్బన్న, పాత్రికేయులు రామాంజనేయులు, భూపాల్, నగేష్,జయరాజు, స్వామన్న,స్వాములు, ఉసేనాలం, పరమేష్, ఆనంద్, విజ్జి, రాజా, సుబ్బన్న, వాడాల శేషు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.