‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ ను సద్వినియోగం చేసుకోండి
1 min readగృహ రుణ విముక్తి పత్రం అందజేసిన మున్సిపల్ వైస్-చైర్మన్ రబ్బానీ
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని 10వ సచివాలయం లో జగనన్న సంపూర్ణ గృహ పథకం పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని ,గృహ నిర్మాణ శాఖ డీఈ ప్రభాకర్, మున్సిపల్ మేనేజర్ బేబీ, సీనియర్ అసిస్టెంట్ లత, అడ్మిన్ హసీబ్, తెలిపారు. అనంతరం మున్సిపల్ వైస్ -చైర్మన్ రబ్బానీ మాట్లాడుతూ గృహరుణం లబ్ధిదారులు తమ రుణాలను తిరిగి చెల్లిస్తున్నారని, ఇది జగనన్న ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం అని వారు తెలిపారు. రుణాలు చెల్లించిన లబ్ధిదారుడు అసలు , వడ్డీ తో కలిపి రూ, 15,000 చెల్లించిన S.జయమ్మ కు గృహ రుణా విముక్తి ” పత్రాలను అందజేశామని తెలిపారు. గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు తమ ఇళ్లపై సర్వ హక్కులు ప్రభుత్వం ద్వారా రిజిస్టర్ దస్తావేజు పొందుటకు జగనన్న కల్పిస్తున్న సదావకాశమే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అని తెలిపారు. అదేవిధంగా లబ్ధిదారుల సాధకబాధకాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయించిన అతి తక్కువ మొత్తం ఏకకాలంలో చెల్లించేలా వీలు కల్పించిందని పేర్కొన్నారు. రుణ విముక్తి లబ్ధిదారులకు ఇంటి పై తమ సర్వ హక్కులను కలగజేయాలనే సదుద్దేశ్యంతోనే నేడు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిందని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని గృహ నిర్మాణ రుణాల లబ్ధిదారులు వన్టైమ్ సెటిల్మెంట్ అవకాశాన్ని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డ్ కౌన్సిలర్ దేశెట్టి శ్రీనివాసులు,7వ వార్డ్ కౌన్సిలర్ నాయక్,8వ వార్డ్ ఇంచార్జి శాలిబాషా సచివాలయ సిబ్బంది జాకీర్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.