కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాల్లో వణుకు
1 min readపల్లెవెలుగు వెబ్: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తోంది. ప్రమాదకరమైన ఈ వేరియంట్ మరో ఉధృతికి దారితీయోచ్చన్న ఆందోళనలు రేకెత్తుతున్నాయి. దక్షిణాఫ్రికాలో కనిపించిన బి.1.1.529 వేరియంట్ పలు పొరుగు దేశాలకు కూడ వ్యాపించింది. తాజాగా ఇజ్రాయిల్, బెల్జియం దేశాల్లో కూడ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికి కూడ ఈ వైరస్ సోకుతుండటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. అధిక మ్యుటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావొచ్చని, వేగంగా వ్యాపించి తీవ్ర లక్షణాలకు దారితీయోచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేరియంట్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. యూరప్, అమెరికా, ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్ని చవిచూశాయి.