చర్చలు లేని.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమా వర్ధిల్లు !
1 min readపల్లెవెలుగు వెబ్:కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ నేత చిదంబరం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో చర్చించకుండానే మూడు సాగు చట్టాలను రద్దు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘చర్చలు లేని పార్లమెంటరీ ప్రజాస్వామ్యమా, వర్ధిల్లు’ అని ఆవేదనతో వ్యాఖ్యానించారు. చిదంబరం ట్విటర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మోదీ మాట్లాడుతూ ఏ అంశంపైన అయినా చర్చిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే మొదటి రోజు జరిగిన తొలి కార్యకలాపం అయిన సాగు చట్టాల రద్దు బిల్లుపై చర్చ జరగలేదన్నారు. చర్చ లేకుండానే వీటిని ఆమోదించారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పిన మాటలు గందరగోళంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.