పురుషుడిగా మారేందుకు… మహిళా కానిస్టేబుల్ కు అనుమతి !
1 min readపల్లెవెలుగు వెబ్ :మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పురుషుడిగా మారేందుకు ఓ మహిళ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అన్ని అంశాలు పరిశీలించిన ప్రభుత్వం లింగమార్పిడికి అవకాశం కల్పించింది. మహిళ నుంచి పురుషుడిగా మారటానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఆమె చిన్నతనం నుంచి పురుష లక్షణాలు కలిగిఉన్నట్టు సైకాలజిస్టులు తెలిపారు. ఈ కారణంతో ఆమెను లింగమార్పడి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. 2019లో మహిళా కానిస్టేబుల్ పురుషుడిగా మారేందుకు దరఖాస్తు పెట్టుకుంది. దరఖాస్తును హోం శాఖకు పంపారు. నిబంధనల ప్రకారం భారత పౌరులు కులం, మతంతో సంబంధం లేకుండా లింగమార్పిడి చేసుకోవచ్చు.