నష్టాల్లో స్టాక్ మార్కెట్ .. ఆటో,బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ సెక్టార్లో అమ్మకాలు !
1 min readపల్లెవెలుగు వెబ్: భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా, యూరప్ మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా సెక్టార్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం పాజిటివ్ గానే ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి గంట వరకు నష్టాల్లోనే కొనసాగాయి. సెన్సెక్స్ 764 పాయింట్ల నష్టంతో 57696 వద్ద, నిఫ్టీ 205 పాయింట్ల నష్టంతో 17196 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 311 పాయింట్ల నష్టంతో 36197 వద్ద క్లోజ్ అయ్యాయి.