PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: ఏపీ రైతు సంఘం

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ : ఈ ఏడాది అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ రైతు సంఘం ఏ ఐ కె ఎస్ ఆధ్వర్యంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, రంగారెడ్డి, వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ సంవత్సరం ఖరీఫ్ లో వేసిన పత్తి టమోటా పంటలు వర్షాలు రాక దెబ్బతిన్నాయన్నారు. అలాగే రబీ సీజన్లో వేసిన పప్పు శనగ వాము ఉల్లి పంట లు అకాల వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయని వాపోయారు. ఈ కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. అప్పులు చేసి భారీగా పెట్టుబడులు పెట్టి పంటలు చేతికొచ్చే సమయంలో వైపరీత్యాలు చోటు చేసుకొని రైతాంగాన్ని నష్టాల ఊబిలోకి నెట్టింది అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎకరాకు 25 వేల నుండి 50 వేల వరకు పంట నష్ట పరిహారం అందజేయాలని కోరారు. అలాగే అన్ని పంటలకు 100% ఇన్సూరెన్స్ ప్రకటించాలని కోరారు పంట నష్టపోయిన రైతులకు కొత్తగా రుణాలు మంజూరు చేయాలని, ఉచితంగా సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకోవాలని నినాదాలు చేస్తూ ఏపీ రైతు సంఘం నాయకులు దాదాపు గంట పాటు ధర్నా చేశారు. రైతులకు పరిహారం అందజేయాలని, సబ్సిడీ విత్తనాలు అందజేయాలని, కొత్తగా రుణాలు మంజూరు చేయాలని నినాదాలు చేస్తూ రైతులు ధర్నా చేపట్టారు. అనంతరం రైతు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇన్చార్జ్ తాసిల్దార్ విష్ణు కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దస్తగిరి సిపిఎం నాయకులు సిద్దయ్య గౌడు గోపాలు తదితరులు పాల్గొన్నారు.

About Author