గుత్తి– మాన్వి నేషనల్ హైవే నిర్మించండి..
1 min readవయా .. ఉరుకుంద ఈరన్న స్వామి పుణ్యక్షేత్రము
మీదుగా వెళ్లేలా చూడండి
– కేంద్ర రవాణా శాఖ మంత్రిని కోరిన కర్నూలు ఎంపీ
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ప్రజల రవాణా సౌకర్యార్థం అనంతపురం జిల్లా గుత్తి పట్టణం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి వరకు నేషనల్ హైవే నిర్మించాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరిని కర్నూలు ఎంపీ డా. శింగరి సంజీవ్ కుమార్ కోరారు. బుధవారం ఢిల్లీలో ఎంపీ డా. సంజీవ్ కుమార్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని మర్యాదపూర్వకంగా కలిశారు . గుత్తి – మాన్వి వెళ్లే నేషనల్ హైవే… కౌతాళం మండలంలోని ఉరుకుందు ఈరన్న స్వామి (లక్ష్మీ నరసింహ స్వామి) దేవాలయ ప్రాంతము మీదుగా వెళ్ళేటట్లు రూట్ మాప్ ను మార్చవలసినదిగా . ఈ సందర్భంగా ఎంపీ కేంద్రమంత్రికి విన్నవించారు. విద్య, వైద్య, సామాజిక, వ్యాపార మరియు వ్యవసాయ రంగాలలో రెండు ప్రాంతాల ప్రజలు కలిసి మెలసి ఉంటారని, కౌతాళం ప్రాంత వాసులు చాలా మందికి కన్నడం వాడుక భాష యని, ఈరన్న స్వామి దర్శన నిమిత్తం కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలు లక్షల సంఖ్యలో వస్తుంటారని మంత్రి వర్యులకు వివరించారు. ఇందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి సానుకూలాంగా స్పందించారని ఎంపీ గారు వివరించారు. స్వామి వారి ఆశీర్వాదం వల్ల ఈ రహదారి నిర్మాణం త్వరలో ప్రారంభం అవుతుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.