PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగు రాష్ట్రాల్లో 800 కోట్ల న‌ల్ల‌ధ‌నం గుర్తింపు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ, తెలంగాణ‌ల్లో ఐటీ సోదాలు క‌ల‌క‌లం రేపాయి. ప‌లు రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల్లో ఐటీ సోదాలు నిర్వ‌హించింది. ఈ సోదాల్లో దాదాపు 800 కోట్ల న‌ల్ల‌ధ‌నం గుర్తించిన‌ట్టు స‌మాచారం. ఈ నెల 5వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఈ మూడు కంపెనీల కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. ఈ సోదాల్లో రూ.800 కోట్ల నల్లధన లావాదేవీల్ని గుర్తించినట్టు తెలిపింది. అంతేకాకుండా ఈ సోదాల్లో రూ.1.64 కోట్ల నగదు కూడా పట్టుబడినట్లు పేర్కొంది. ఈ మూడు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు.. హైదరాబాద్‌, కర్నూలు, వైజాగ్‌, అనంతపురం, నంద్యాల, బళ్లారి వంటి పలు నగరాలు, పట్టణాల్లో భూ అభివృద్ధి, నిర్మాణ రంగంలో ఉన్నట్టు సీబీడీటీ తెలిపింది. పన్ను ఎగవేసేందుకు ఈ కంపెనీలు అనుసరిస్తున్న అక్రమాలూ ఈ సోదాల్లో బయట పడ్డాయి. ఒక కంపెనీ అయితే ఇందుకోసం ఏకంగా ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఉపయోగిస్తున్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్‌ కంటే అధిక ధరకు అమ్మిన నిధులు లెక్కల్లోకి రాకుండా జాగ్రత్త పడ్డాయి. ఐటీ సోదాలు ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

                                           

About Author