ప్రపంచానికి ఐటీ హబ్ గా భారత్
1 min readపల్లెవెలుగువెబ్ : భారత్ ప్రపంచ దేశాలకు ఐటీ హబ్ గా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో భాగంగా దావోస్ లో జరిగిన స్టేట్ ఆఫ్ ది వరల్డ్ అంశం పై మోదీ వర్చువల్ గా ప్రసంగించారు. కరోన పై జీ 20 సదస్సులో చర్చ జరగాలని అన్నారు. కరోన వేవ్ లను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొనగలదని తెలిపారు. ఔషధ రంగంలో భారత్ మూడో స్థానంలో ఉందని అన్నారు. పెట్టుబడులకు భారత్ అనువైన స్థానమని పేర్కొన్నారు. భారత్ లో గడిచిన ఆరు నెలల్లో పది వేల స్టార్టప్ కంపెనీలు నమోదు చేసుకున్నాయని తెలిపారు. భారత్ లో యాభై లక్షలకు పైగా సాఫ్ట్ వేర్ డెవలపర్లు పనిచేస్తున్నారని, రికార్డు స్థాయిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను అందిస్తోందని చెప్పారు.