PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్ది ఆంజనేయస్వామి దేవాలయంలో అన్నదానం

1 min read

పల్లెవెలుగు వెబ్, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం స్వయంభు శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం నందు మంగళవారం పలు పూజలు మరియు నిత్య అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా మద్ది ఆంజనేయస్వామి దర్శనార్థం అనేకమంది భక్తులు స్వామివారి దీవెనల కోసం అధిక సంఖ్యలో విచ్చేసారు.ఈ పూజా కార్యక్రమాల విశేషమై లింగపాలెం మండలం మటంగూడెం గ్రామస్తులచే హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణము చేయడం జరిగింది.పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం కరగపాడు గ్రామస్తులయిన  ఏ.వి.వి.ఎస్.ఎస్.కె మనోజ్  స్వామి వారి దేవస్థానంలో జరిగే నిత్యఅన్నదానము కు రూ.1,00,116/- విరాళంగా స్వామివారికి అందజేసినట్టుగా ఆలయ కార్యనిర్వాహణఅధికారి ప్రకటనలో తెలియజేశారు.శ్రీ స్వామివారి దర్శనార్థం అనేక మంది హాజరయ్యారు. సుమారు 1100 భక్తులకు శ్రీ స్వామివారి నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. శ్రీ స్వామివారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.2,15,520/- ఆదాయం వచ్చినట్లు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు 19వ తేదీ అనగా  నుండి శ్రీ స్వామివారి దేవస్థానం నందు గర్భాలయ దర్శనము అంతరాలయ దర్శనములు రద్దుపరచి ఉచిత దర్శనం ఏర్పాటు చేయడమైనది అని తెలిపారు. విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ పర్యవేక్షణలో శానిటైజ్ చేయించడం మాస్కులు ధరించడం వంటి తగిన ఏర్పాట్లు చేయించినట్లు ఆలయ ధర్మకర్తలు మండల అధ్యక్షురాలు శ్రీమతి సరిత విజయభాస్కర్ రెడ్డి మరియు కార్యనిర్వహణఅధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు.

About Author