పీఆర్సీ చీకటి ఉత్తర్వులను ఉపసంహరించాల్సిందే… : ఫ్యాప్టో
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం నిన్న అర్ధ రాత్రి విడుదల చేసిన వేతన సవరణ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయసంఘాల సమాఖ్య డిమాండ్ చేస్తోంది. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ముందున్న గాంధీ విగ్రహం ముందు జరిగిన ఉత్తర్వుల కాల్చివేత కార్యక్రమం చైర్మన్ ఓంకార్ యాదవ్, సెక్రటరీ జనరల్ గట్టుతిమ్మప్ప ఆధ్వర్యంలో జరిగింది. ఏపిజేఏసి సెక్రటరీ జనరల్ హృదయరాజు మాట్లాడుతూ గత విధానానికి విరుద్ధంగా అశుతోష్ మిశ్రా రిపోర్టు ను బయటపెట్టకుండా సిఎస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఆర్ కంటే తక్కువ 23శాతం ఫిట్మెంటు ఇవ్వడం జరిగింది. పాత స్లాబుల్లో వున్న 12,14.5,20,30శాతన్ని తీసివేసి 8,16,24 శాతంగా ఇంటి అద్దె అలవెన్సును ఇవ్వాలని ఉత్తర్వులిచ్చారు.
ఫ్యాప్టో రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రావు మాట్లాడుతూ 20 వ తేదీన జరిగే కలెక్టరేట్ ముట్టడి లో వేల సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో కర్నూలు మునిసిపల్ పాఠశాల ల నుండి ఇబ్రహీం, విశ్వేశ్వరరెడ్డి మరియు రాముడు నాయకత్వం లో మహిళా ఉపాద్యాయులు, యూటిఎఫ్ సురేష్, ఎల్లప్ప,ఎస్టియు నుండి గోకారి,గోవిందు,ఏపిటిఎఫ్ నుండి ఇస్మాయిల్, కమలాకర్,డిటిఎఫ్ నుండి రత్నం ఏసేపు,బజారప్ప, బిటిఏనుండి ఆనంద్,ఆప్టానుండి రాజాసాగర్ ,బషీర్,పిఇటి అసోషియేషన్ నుండి లక్మయ్య ఏపి టీచర్స్ గిల్డ్ నుండి విక్టర్ ఇమ్మానుల్, RUPP సంఘ భాద్యులు హాజరయ్యారు. వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి.