రూ. 66 కోట్లు వెనక్కి ఇచ్చిన కంపెనీ !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రొటన్ స్టార్టప్ విభిన్నమైన ఆలోచనతో ప్రారంభమైంది. కరోన కారణంగా ఆదరణ దక్కక ఆర్నెళ్లలోనే మూతపడింది. భారత్ లో కార్యకలాపాలు మొదలుపెట్టక ముందే మూతపడింది. అనిల్ గోటేటి, మౌసమ్ భట్‌లు కిందటి ఏడాది ప్రొటన్ స్టార్టప్‌ను ప్రారంభించారు. 2021 జులైలో అమెరికాలో ఈ స్టార్టప్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. న్యాయవాదులు, గ్రాఫిక్ డిజైనర్లు, పోషకాహార నిపుణులు, ఇలా స్వతంత్ర నిపుణులకు.. తమ వ్యాపారాలను ఆన్‌లైన్‌లో ప్రారంభించడానికి, వీడియోలను రూపొందించడానికి, ప్రత్యక్ష సెషన్‌లను నిర్వహించడానికి, చెల్లింపు లింక్‌లను రూపొందించడానికి, వాళ్ల వ్యాపారాన్ని ట్రాక్ చేయడానికి ఇది తన ప్లాట్‌ఫారమ్‌గా ఉంటుందని ఆరంభంలో ప్రకటించుకుంది ప్రొటాన్. దీంతో ప్రొటాన్ కంపెనీలోకి రూ. 66 కోట్ల పెట్టుబడి వచ్చింది. స్టార్టప్ ఫెయిల్యూర్ కావడంతో ఇన్వెస్టర్ల డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చినట్టు కంపెనీ ప్రకటించింది.