డీఈఓ చేతుల మీదుగా… ఆప్తా డైరీ ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్: విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్( ఆప్తా) నాయకులు ముందుండి పరిష్కరించుకుంటారని అభినందించారు కర్నూలు జిల్లా విద్యాధికారి రంగారెడ్డి. ఆదివారం ఉదయం డీఈఓ ఛాంబరులలో ఆప్తా 222 డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలోఅడిషనల్ డైరెక్టర్ అనురాధ, మరియు ఉర్దూ డి ఐ ఆదాము భాష తదితరులు పాల్గొన్నారు. ఆప్తా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు,అదనపు ప్రధాన కార్యదర్శి కందుల యోగీశ్వరుడు, జిల్లా అధ్యక్షుడు మునగాల మధు సుధన్ రెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి సేవా నాయక్ మరియు ఆర్థిక కార్యదర్శి బషీర్ ఆహమ్మద్ జిల్లాలో వీలిన పాఠశాలల లో నెలకొన్న సమస్య ల గురించి జిల్లా విద్యాధికారికి విన్నవించారు. ఇందుకు సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఈ సందర్భంగా డీఈఓ హామీ ఇచ్చారు.