పశువుల షెడ్లో లా క్లాసులు.. కాలేజీకి వెళ్లకుండానే డిగ్రీ !
1 min readపల్లెవెలుగువెబ్ : లా కాలేజీల నిర్వహణ పై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సంఘవ్యతిరేక శక్తులు కూడ లా డిగ్రీలు తెచ్చుకోవడం సాధ్యమవుతోందని వ్యాఖ్యానించింది. ఆంధ్ర, కర్ణాటకల్లో పశువుల షెడ్లలో లా క్లాసులు నిర్వహిస్తున్నారని మండిపడింది. క్లాసులకు హాజరుకాకుండానే లా డిగ్రీ వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయవిద్య పలచన అయిపోయిందన్నారు. ఈ విషయం పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించింది. గుజరాత్‌కు చెందిన ఓ మహిళ వేరే ఉద్యోగం చేస్తూనే న్యాయవాదిగా పేరు నమోదు చేసుకోవడాన్ని సమర్థిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని బార్ కౌన్సిల్ సుప్రీం కోర్టులో సవాలుచేయగా మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. వేరే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి న్యాయవాదిగా నమోదు చేసుకోవడాన్ని అనుమతించడం సరికాదని జస్టిస్ సుంద్రేశ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.