ఒమిక్రాన్ మనిషి శరీరం పై ఎంతసేపు ఉంటుందంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఒమిక్రాన్ మనిషి శరీరం పై ఎంతసేపు ఉంటుందన్న దాని పై జపాన్ కు చెందిన పరిశోధకులు ఆసక్తికర విషయం వెల్లడించారు. మనిషి చర్మం పై ఒమిక్రాన్ వేరియంట్ 21 గంటలు సజీవంగా ఉంటుందని, అదే ప్లాస్టిక్ పైన దాదాపు 8 రోజుల పాటు జీవించి ఉంటుందని క్యోటో ప్రీఫెక్చురల్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల బృందం గుర్తించింది. ఒమిక్రాన్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందడానికి ఇదే కారణమని తెలిపారు. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ఒరిజినల్ స్ట్రెయిన్ తో పోలిస్తే రెండు రెట్లు కన్నా అధికంగా చర్మం, ప్లాస్టిక్ పై జీవించగలవట. అత్యధిక పర్యావరణ స్థిరత్వాన్ని కలిగి ఉండటం వల్లే ఈ వేరియంట్లతో ఎక్కువ వ్యాప్తి జరిగినట్టు పేర్కొన్నారు.