అజ్ఞాతంలోకి ప్రధాని కుటుంబం !
1 min readపల్లెవెలుగువెబ్ : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లారు. కోవిడ్ ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాలని చూసిన ట్రూడోకు ఆ దేశ ప్రజల నుంచి నిరసన గళం వినిపిస్తోంది. కెనడా దేశ రాజధాని ఒట్టావా నిరసన కారులతో అట్టడుకుతోంది. వేలాది మంది నిరసన కారులు ఒట్టావాలోని పరిపాలన కార్యాలయం పార్లమెంట్ హిల్ వద్దకు చేరుకుని ఆ దేశ ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో కరోనా వాక్సిన్ తప్పనిసరి చేస్తూ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదేశాలు జారిచేశారు. ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలు ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిలించాయి. దీంతో కుటంబంతో సహా రాజధానిని వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ప్రధాని ట్రూడో.. ఒక సీక్రెట్ ప్లేస్కు కెనడా ప్రధానితో సహా ఆయన కుటుంబం వెళ్లినట్లు స్థానిక మీడియా పేర్కొంది.