వ్యాక్సిన్ వేసుకుంటేనే మద్యం !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన నివారణకు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేసుకుంటేనే మద్యం ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం నిబంధన పెట్టింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌పై అవగాహనను కూడా కల్పిస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేసుకున్న వారికి బహుమతులు కూడా ఇస్తున్నారు. వాయిలాడ్ తురయ్ జిల్లా అధికార యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మద్యం ప్రియులకు షాకిచ్చారు. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మద్యం షాపుల్లో కొనుగోలుదారులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపెట్టాలనే నిబంధన పెట్టారు. ప్రజలు ఈ ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలని, కోవిడ్ రహిత జిల్లాగా మార్చేందుకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.