చెప్పినట్టే చేసింది.. ఉద్యోగులకు జీతాలు పడ్డాయ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం చెప్పినట్టే చేసింది. ఉద్యోగులందరికీ సాయంత్రానికి జీతాలు జమచేస్తామంటూ నిన్న మంత్రలు కమిటీ చెప్పింది. దానికి తగ్గట్టుగానే ఉదయానికి అందరికీ జీతాలు పడ్డాయి. పదకొండవ పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల అకౌంట్లలో ఉదయం నుంచి వేతనాలు పడిపోయాయి. ప్రతి నెలా ఉద్యోగులకు ఆలస్యంగా వేతనాలు అందుతుండగా.. ఈ నెలలో మాత్రం బుధవారం ఉదయం లోపు అందరికీ వేతనాలు పడ్డాయి. కాగా.. ట్రెజరీ ఉద్యోగులకు మాత్రం ఇంకా వేతనాలు పడలేదు. వేతన బిల్లులు ప్రాసెస్ చేయకపోవడంతో ట్రెజరీ ఉద్యోగులపై ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉన్నారు. ఐదు డీఏలను కలిపి మరీ వేతనాలను అందించింది. అయితే హెచ్ఆర్ఏలో కోత విధించింది. విజయవాడ విశాఖపట్నంలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం సీసీఏను రద్దు చేసింది.