లత మంగేష్కర్ ఇకలేరు
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ గాయని, భారత గానకోకి లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమె కన్నుమూశారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు భౌతికకాయాన్ని ఆమె స్వగృహానికి తీసుకెళ్లనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ప్రభుత్వ లాంచనాలతో సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ముంబయిలోని శివాజీ పార్కులో మహారాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించనుంది. లతా మంగేష్కర్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తదితరులు సంతాపం ప్రకటించారు. ఈరోజు, రేపు జాతీయ సంతాప దినాలుగా పాటించాలని కేంద్రం ఆదేశించింది. రెండు రోజులు జాతీయ జెండాను అవనతం చేయనున్నట్టు కేంద్రం తెలిపింది.