జైల్లోనే నిరాహార దీక్షకు విపక్షనేత
1 min readపల్లె వెలుగు వెబ్: జైలులో తనని అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ. 2014లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆయన్ని అరెస్టు చేశారు. ఆయన విడుదల కోసం ఇటీవల పెద్ద ఎత్తున రష్యాలో ఆందోళనలు జరిగాయి. అలెక్సీ నావల్నీ కు సరైన వైద్య సదుపాయాల్ని అందించడంలేదని ఆరోపిస్తున్నారు. జైలులో తనను గంట గంటకు నిద్రలేపి తీవ్రంగా వేధిస్తున్నారని అలెక్సీ ఆరోపించారు. సరైన వైద్య సదుపాయం అందించడంలేదని జైలు అధికారికి అలెక్సీ ఓ లేఖ రాశారు. తన అనారోగ్యాన్ని పరీక్షించేందుకు వైద్య నిపుణుడిని జైలులోపలికి అనుమతించాలని కోరి.. వారంరోజులు గడుస్తున్నా.. జైలు అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. తాను నిరాహార దీక్షకు దిగుతున్నట్టు అలెక్సీ నావల్నీ ప్రకటించారు. అయితే… అలెక్సీ విడుదల కోసం పోరాడుతున్న 3 వేల మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో అలెక్సీ నావల్నీ భార్య యూలియా కూడ ఉన్నారు.