రెయిన్ అలర్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీకి భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ జె. నివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారన్నారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయన్నారు. దీని ప్రభావంతో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపారు.