ఏపీలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం గణాంకాలను వెల్లడించింది. ష్ట్రంలోని 33 ప్రభుత్వ శాఖల పరిధిలో మంజూరైన(సాక్షన్డ్) పోస్టులు 7,71,177 ఉండగా, అందులో 5,29,868 మంది రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. 2,41,309 ఖాళీగా ఉన్నాయి. ఇందులో 1,75,000 పోస్టులను ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో నిర్వహిస్తోంది. అయినా నికరంగా ఇంకా 66,309 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ వివరాలను శాసనసభ ముందుంచారు.