‘ఆకాశ్’ ను కొన్న బైజూస్: డీల్ విలువ 7300 కోట్లు
1 min readపల్లె వెలుగు వెబ్: ప్రముఖ ఎడ్యుకేషనల్ సర్వీస్ సంస్థ ‘ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ’ను స్టార్టప్ కంపెనీ బైజూస్
కొన్నది. ఈ డీల్ విలువ రూ.7300 కోట్లు. ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రధానంగా ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే సంస్థ. ఈ డీల్ విద్యారంగానికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద కొనుగోలు. ఇందులో 60 శాతం నగదు రూపంలో.. మిగతాది ఈక్విటీ రూపంలో లభిస్తుంది. బ్లాక్ స్టోన్ వాటా 37.9 శాతం కూడ బైజూస్ పరం కానున్నది. ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కొనుగోలుతో.. బైజూస్ కంపెనీ విలువ అమాంతం పెరిగింది. ఆ కంపెనీ విలువ దాదాపు 85,290 కోట్లకు చేరింది. దేశంలోని ఏ స్టార్టప్ కంపెనీ విలువ ఈ స్థాయిలో లేదు. కేరళకు చెందిన రవీంద్రన్ బైజూస్ స్టార్టప్ ను ప్రారంభించారు. ఆన్ లైన్ ఎడ్యుకేషన్ లో ఉన్న చాలా కంపెనీలను ఇప్పటికే బైజూస్ టేకోవర్ చేసింది. 8 కోట్ల మంది ఈ యాప్ లో పేర్లు నమోదు చేసుకోగా.. 55 లక్షల మంది పెయిడ్ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. వీరిలో 86 శాతం మంది ప్రతి ఏటా రెన్యూవల్ చేసుకుంటారు.