వడ్డీ రేట్లు యథాతథం
1 min readముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ప్రారంభమైంది. వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. దీంతో ప్రస్తుతం ఉన్న రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపోరేటు 3.3 శాతంలో ఎలాంటి మార్పు ఉండదు. కరోన కేసులు పెరుగుదల, కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధింపుకు అవకాశం ఉన్న కారణంగా.. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయాలు తీసుకుంది. ధరల స్థిరత్వం, వృద్ధి, ఆర్థిక స్థిరత్వం మీద ఆర్బీఐ ప్రధానంగా దృష్టి సారించింది.