బంగారం ధరను దాటిన మిర్చి ధర !
1 min readపల్లెవెలుగువెబ్ : మిర్చి ధర తులం బంగారం ధరను దాటేసింది. వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ఇవాళ క్వింటాల్ మిర్చి ధర 55,551 రూపాయలు పలికింది. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మిర్చి ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందిపడుతున్నారు. ప్రధానంగా దిగుబడి రాకపోవడమే ధర పెరగడానికి కారణంగా చెబుతన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పంట పై కొత్త రకం వైరస్ దాడి చేసింది. దీనిని ప్రస్తుతం ఉన్న రసాయన మందులతో అరికట్టలేకపోయారు. దీని ఫలితంగా పెద్ద ఎత్తున మిర్చి పంట నష్టపోయింది. దీంతో ఎప్పుడూ లేనంతగా దిగుబడి తగ్గడంతో డిమాండ్ పెరిగింది.