PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ స్థితిని భార‌త్ నిర్మూలించింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఐఎంఎఫ్ ఆస‌క్తిక‌ర గ‌ణాంకాలు విడుద‌ల చేసింది. దయనీయ నిరుపేద స్థితిని భారత దేశం చాలా వరకు నిర్మూలించిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రచురించిన ఓ వర్కింగ్ పేపర్‌ పేర్కొంది. 40 ఏళ్ళలో రాజ్యం అందజేసిన ఆహార సహాయం ద్వారా వినియోగంలో అసమానతలను అత్యంత కనిష్ట స్థాయికి తగ్గించిందని తెలిపింది. ఈ వర్కింగ్ పేపర్‌ను ఆర్థికవేత్తలు సుర్జీత్ భల్లా, అరవింద్ విర్మానీ, కరణ్ భసిన్ రూపొందించారు. అత్యంత దయనీయ పేదరికంలో మగ్గిపోతున్నవారు, దాదాపు 1 శాతం కన్నా తక్కువ మంది, కోవిడ్-19 మహమ్మారి సమయంలో సైతం నిలదొక్కుకున్నారని, రాయితీతో కూడిన దాతృత్వం, ముఖ్యంగా ఆహార సరుకులను ఇవ్వడం వల్ల వీరు ఈ సమయంలో జీవించగలిగారని ఐఎంఎఫ్ వర్కింగ్ పేపర్ తెలిపింది.

                                               

About Author