కేంద్రంతో చర్చలకు సిద్ధం
1 min readపల్లెవెలుగు వెబ్: కేంద్రంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయిత్ ప్రకటించారు. నూతన సాగు చట్టాల అమలును వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న రైతులతో ప్రభుత్వం చర్చించాలని కోరారు. గతంలో ఆగిపోయిన దగ్గరి నుంచి చర్చలు ప్రారంభించాలని కోరారు. తమ డిమాండ్ల లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని, అలాగే రైతులకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని కోరారు. సంయుక్త కిసాన్ సభ నాయకులను చర్చలకు ఆహ్వానించాలని కేంద్ర ప్రభుత్వానికి రాకేష్ టికాయిత్ విజ్ఞప్తి చేశారు. గత సంవత్సరం నవంబర్ లో ఢిల్లీ సరిహద్దుల్లో ప్రారంభమయిన రైతుల పోరాటం ఇంకా కొనసాగుతోంది. నూతన సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని రైతులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఒక దశ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పటికి .. అవి ఓ కొలిక్కి రాలేదు.