కరుగుతున్న మంచు పర్వతాలు.. !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉత్తరాఖండ్ లో మార్చి, ఏప్రిల్ నెలల్లో అక్కడ నమోదయిన ఉష్ణోగ్రతలు గత 30 ఏళ్లలో ఎప్పుడూ నమోదుకాలేదని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీర్ఘకాలంపాటు పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతల స్థాయిల కారణంగా మంచు కరిగే రేటు కూడా పెరిగిందని వాతావరణ కేంద్రం వివరించింది. అధిక ఎత్తులో ఉండే బద్రీనాథ్, కేదార్‌నాథ్ వంటి ప్రాంతాల్లో గత కొన్నేళ్ల మాదిరిగా ప్రస్తుతం మంచు లేదు. హేమకుంద్ సాహిబ్ మార్గంలో వేగంగా మంచు కరిగిపోతోందని ప్రాంతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి ఏప్రిల్ 20 మధ్య ఇక్కడ సగటు ఉష్ణోగ్రత కంటే కనీసం 5-7 డిగ్రీలు మేర పెరుగుదల నమోదయింది. ఉత్తరఖండ్‌లోని మైదాన, పర్వత ప్రాంతాలలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.