ఆచార్యలో.. కాజల్ పాత్ర ఎందుకు తొలగించారంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య
. ఇందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో మొదట హీరోయిన్ గా కాజల్ ను తీసుకున్నారు. తర్వాత తొలగించారు. దీనికి గల కారణాలు దర్శకుడు కొరటాల శివ వెల్లడించారు. ‘సినిమా అనుకున్నప్పుడు.. హీరో అన్నాక హీరోయిన్ పక్కా ఉండాలి అనుకున్నాం. అందుకే హీరోయిన్ కోసం ఓ ఫన్నీ క్యారెక్టర్ క్రియేట్ చేశాం. కాజల్‌తో నాలుగు రోజుల పాటు షూటింగ్ కూడా చేశాం. కానీ ‘ఆచార్య’పాత్రకు లవ్ ఇంట్రస్ట్ ఉంటే బాగుంటుందా? లేదా? అనే డౌట్ వచ్చింది. నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగోదు. పాటలు పెట్టలేం. ముగింపు సరిగా ఉండదు. అంత పెద్ద హీరోయిన్‌తో అలాంటి పాత్ర చేయిస్తే బాగోదు అనిపించింది. అదే విషయాన్ని చిరంజీవిగారికి చెబితే, కథకు ఏది అవసరం అయితే అది చెయ్ అన్నారు. ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకో అని చెప్పారు. కాజల్‌కు ఇదే విషయాన్ని చెప్పాను. ఆమె అర్థం చేసుకున్నారు. అందంగా నవ్వి.. అందరినీ మిస్ అవుతున్నాను. తప్పకుండా ఫ్యూచర్‌లో కలిసి సినిమా చేద్దామని అన్నారు. అలా కాజల్ పాత్రను తొలగించాం’ అని కొరటాల చెప్పుకొచ్చారు.