కరోన ముప్పు తొలగలేదు.. అప్రమత్తంగా ఉండాలి !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో కోవిడ్-19 ముప్పు పూర్తిగా తొలగలేదని, అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని కోవిడ్ పరిస్థితిపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని బుధవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాల మళ్లీ పెరుగుతుండటం, నాలుగో వేవ్ వచ్చే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతుండగా, దేశంలో కొత్తగా కరోనా కేసులు దాదాపు 3 వేలకు చేరుతున్న నేపథ్యంలో ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ అంశాలపై చర్చించారు. ఫోర్త్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, మందులు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.