18 లక్షల ఖాతాలు బ్లాక్ చేసిన వాట్సాప్ !
1 min readపల్లెవెలుగువెబ్ : 2022 మార్చిలో 18 లక్షల ఖాతాలను బ్లాక్ చేసినట్టు వాట్సాప్ ప్రకటించింది. భారత ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ఐటీ చట్టాల ప్రకారం 50 లక్షల కంటే ఎక్కువ మంది ఖాతాదారులు ఉన్న సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ గ్రీవెన్స్‌ను స్వీకరించడంతో పాటు నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించాల్సి ఉంది. కాగా 2022 మార్చిలో ఏకంగా 18 లక్షల ఖాతాలను బ్లాక్ చేసినట్టు వాట్సాప్ ప్రకటించింది. అంతుకు ముందు ఫిబ్రవరిలో 14.26 లక్షల ఖాతాలపై కొరడా ఝులిపించింది.