దేశంలో సంతాన సాఫల్య రేటు ఎందుకు తగ్గుతోంది ?
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో సంపూర్ణ సంతాన సాఫల్య రేటు తగ్గుతోందని ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. 2015-16లో నిర్వహించిన నాలుగో సర్వేతో పోలిస్తే.. సంపూర్ణ సంతాన సాఫల్య రేటు 2.2 నుంచి 2కు తగ్గిపోయింది. తరాలు మారినా జనసంఖ్యలో పెద్దగా తేడాలు రాకుండా ఉండాలంటే.. అందుకు ‘రీప్లేస్ మెంట్ లెవెల్ ఆఫ్ ఫెర్టిలిటీ రేటు’ కీలకం. అది మనదేశంలో 2.1గా ఉంది. అంటే సగటున ప్రతి మహిళా 2.1 మంది పిల్లలకు జన్మనిస్తే జనసంఖ్యలో పెద్దగా తేడాలుండవు. వివాహ వయస్సు రాకముందే పెళ్లి చేసుకున్న మహిళల సంఖ్య పశ్చిమబెంగాల్‌లో ఎక్కువగా ఉన్నట్టు తేలింది. 15-19 ఏళ్ల వయసులో గర్భం దాల్చినవారిలో ముస్లిం మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. దేశంలోని మహిళల్లో మద్యపానం అలవాటు ఉన్నవారి సంఖ్య 1 శాతం కాగా.. పురుషుల్లో ఆ అలవాటు 22 శాతం మందికి ఉంది. మద్యపానం చేసే స్త్రీలలో 17 శాతం మంది నిత్యం మందు తాగేవారే కాగా.. 37శాతం మంది వారానికొకసారి తాగుతున్నారు. పురుషుల్లో 15 శాతం మంది రోజూ, 43 శాతం వారానికొకసారి తాగుతున్నారు. మద్యపానం చేసే మహిళలు అత్యధికంగా అరుణాచల్‌ప్రదేశ్ ఉన్నారు.