క్రిప్టో ఆదాయం పై 28 శాతం జీఎస్టీ !
1 min readపల్లెవెలుగువెబ్ : బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలపై మరింత పన్ను వడ్డించే దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. క్యాసినోలు, బెట్టింగ్, లాటరీలతో పాటు క్రిప్టో కరెన్సీలపైనా 28 శాతం జీఎ్‌సటీ విధించాలని జీఎ్‌సటీ మండలి భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే సమావేశంలో జీఎ్‌సటీ మండలి ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే గనుక, క్రిప్టో మైనింగ్‌తో పాటు వాటి క్రయ,విక్రయాలపై 28 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జీఎ్‌సటీ మండలి తదుపరి సమావేశ తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. దేశంలో క్రిప్టో పెట్టుబడులను నిరుత్సాహపరిచేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు పన్నులు విధించింది.