సోనియా, రాహుల్ కు ఈడీ నోటీస్.. పెంపుడు సంస్థ అంటూ ఆరోపణ !
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి, ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. గురువారం తమ ఎదుట హాజరుకావాలని ఈడీ సమన్లు పంపింది. మరోవైపు ఈడీ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కేంద్ర ప్రభుత్వ.. ప్రజా వ్యతిరేక ఉద్యమ స్వరాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జెవాలా ఆరోపించారు. మోడీ పెంపుడు సంస్థగా ఈడీ పనిచేస్తోందన్నారు. తమ నేతలకు నోటీసులు ఇవ్వదాన్ని సరికొత్త పిరికిపంద చర్య అని సుర్జేవాలా వ్యాఖ్యానించారు.