మొక్కలు పెంచడం.. అందరి బాధ్యత : ‘మలబార్’
1 min readపల్లెవెలుగు వెబ్: మొక్కలు నాటడం… పెంచడం ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు షోరూమ్ స్టోర్ హెడ్ ఫయాజ్, మార్కెటింగ్ మేనేజర్ నూర్వుల్లా. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కర్నూలు షోరూం వద్ద నగర వాసులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫయాజ్, నూర్ వుల్లా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అడవుల శాతం తగ్గిపోతోందని, దీని వల్ల భావితరాల వారు ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని, అడవులను పెంచాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోవడానికి ఇదొక్కటే మార్గమన్నారు. అనంతరం ప్రజలు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ యాజమాన్యం మొక్కలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం మొక్కలు పంపిణీ చేసి… పర్యావరణ పరిరక్షణకు పాటుపాడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంస్థ మేనేజర్ అజీష్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.