ఆ రెండు రంగాల్లో భారీ లాభాలుంటాయి..?
1 min readపల్లెవెలుగు వెబ్: సిమెంట్, మెటల్ రంగాల్లో భారీ అభివృద్ధి జరగబోతుందని అంచనా వేశారు ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు రాకేష్ ఝున్ ఝున్ వాలా. ఈ రెండు రంగాల్ని పెట్టుబడిదారులు చాలా నిర్లక్ష్యం చేశారని.. త్వరలో మంచి అభివృద్ధి నమోదవుతుందని అన్నారు. కరోన రెండో దశ ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద తాత్కాలికమేనని అన్నారు. కరోన విజృంభిస్తున్నప్పటికీ.. రెండు అంకెల వృద్ధి నమోదవుతుందని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లు 2020 మార్చిలో నష్టపోయినట్టుగా.. నష్టపోవడంలేదని అన్నారు. ఒకవేళ రోజుకు 6 లక్షల కేసులు నమోదైతే.. మార్కెట్ లో డౌన్ ట్రెండ్ చూడవచ్చని అన్నారు. స్టాక్ మార్కెట్ చరిత్రలో 2020 మార్చి గుర్తుండిపోయే రోజుని అన్నారు. 1989 బడ్జెట్, సెప్టంబర్ 11. 2001 తర్వాత ఆస్థాయిలో మార్చి 2020లో మార్కెట్లు నష్టపోయాయని అన్నారు. 2020 మార్చిలో పెట్టుబడిపెట్టిన వారి షేర్ల విలువ రెండింతలు, మూడింతలు పెరిగినట్టు ఆయన తెలిపారు.