అంతరిక్షంలోకి జీశాట్-24 ఉపగ్రహం
1 min readపల్లెవెలుగువెబ్ : జీశాట్–24 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని బుధవారం తెల్లవారుజామున ప్రయోగించనున్నారు. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ , కేంద ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ దీనిని సంయుక్తంగా రూపాందించింది. ఫ్రాన్స్‌లోని ప్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–వీ వీఏ257 రాకెట్ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్లో రూపొందించిన 4,180 కిలోల బరువు కలిగిన జీశాట్–24 ఉపగ్రహాన్ని గత నెల 18న ఫ్రాన్స్‌కు పంపించిన విషయం విదితమే. ఈ ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చారు. డీటీహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చేందుకు పాన్ ఇండియా కవరేజీతో ఈ ఉపగ్రహాన్ని రోదసీలో పంపుతున్నారు.