మూడు నెలల్లో 100 మందికి మరణ శిక్ష !
1 min readపల్లెవెలుగువెబ్ : ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక విడుదల చేసింది. ఇరాన్ దేశంలో ఈ ఏడాది కేవలం మూడు నెలల్లో 100మందికి పైగా వ్యక్తులను ఉరి తీశారు. ఈ ఏడాది జనవరి 1వతేదీ నుంచి మార్చి 20వతేదీల మధ్య మూడు నెలల్లో 105మందికి మరణ శిక్షలు అమలు చేశారని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తన తాజా నివేదికలో వెల్లడించింది. ఉరితీతకు గురైన వారిలో ఇరాన్ దేశంలో మైనారిటీ వర్గాలకు చెందిన వారున్నారు. జెనీవాలోని యూఎన్ మానవ హక్కుల మండలిలో మానవ హక్కుల డిప్యూటీ చీఫ్ నాడా అల్-నషిఫ్ ఇరాన్‌పై తాజా నివేదికను విడుదల చేశారు.