చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
1 min readపల్లెవెలుగువెబ్ : కొద్దిరోజులుగా మందకొడిగా ఉన్న నైరుతి రుతుపవనాలు గత నాలుగు రోజులుగా చురుగ్గా మారాయి. శనివారం ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, రాజస్థాన్‌లోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో దేశంలోని అన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకినట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. జూలై 8 కల్లా దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాల్సి ఉండగా, ఈ ఏడాది ఆరు రోజుల ముందుగానే విస్తరణ ముగిసింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.