అరటి పండ్ల ఖర్చు రూ. 35 లక్షలు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉత్తరాఖండ్ రంజీ క్రికెట్ అసోసియేషన్‌లో చోటుచేసుకుంటున్న అక్రమాల గురించి కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఈ వార్తలు సంచలనంగా మారాయి. కోవిడ్-19 తర్వాత క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఉత్తరాఖండ్(సీఏయూ) తప్పుడు రిపోర్టులు అందిస్తూ వచ్చింది. తమ రంజీ ఆటగాళ్లకు రోజు దినసరి కూలి కింద రూ.వంద ఇవ్వడం సంచలనం రేపింది. సీఏయూ రిపోర్ట్ ప్రకారం రూ.1.74 కోట్లు కేవలం ఫుడ్, ఇతర క్యాటరింగ్ సేవలకు ఉపయోగించినట్లు పేర్కింది. కేవలం ఆటగాళ్లకు అందించే అరటిపండ్లకు రూ. 35 లక్షల దొంగ బిల్లులను చూపించింది. ఇక రూ.49.5 లక్షలు రోజూవారి అలెవన్స్‌ల కింద తప్పుడు లెక్కలు సమర్పించింది.