33 కోట్ల మంది దేవతలా ?
1 min readపల్లెవెలుగువెబ్ : హిందూ దేవతలపై అజ్మేర్ దర్గాలో మరో మత ప్రబోధకుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువులకు 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్లు ఎలా ఉంటారు? అదెలా సాధ్యం? సగం మనిషి, సగం జంతువులా ఉండే గణేశ్, హనుమాన్ కూడా దేవుళ్లా?’’ అని అజ్మేర్లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా అంజుమన్ కమిటీ కార్యదర్శి సయ్యద్ సర్వర్ చిస్తీ కుమారుడు అదిల్ చిస్తీ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వీడియో జూన్ 23న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆదిల్‌పై కఠినచర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి. అయితే, హిందూ సోదరసోదరీమణుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, తాను బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మాత్రమే ప్రశ్నలు వేశానని అదిల్ చిస్తీ మరో వీడియో విడుదల చేశారు.