5 రోజుల్లో పది లక్షల కోట్లు సృష్టి !
1 min readపల్లెవెలుగువెబ్ : సెన్సెక్స్ అయిదు రోజుల్లో 2,266 పాయింట్లు దూసుకెళ్లిన బీఎస్‌ఈలో రూ.10 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.260 లక్షల కోట్లకు ఎగసింది. ఇదే ఐదు ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ 556 పాయింట్లు పెరిగింది. ‘‘చమురు ధరలు దిగివచ్చాయి. యూఎస్ ఫెడ్ రేట్ల పెంపు దూకుడుగా ఉండకపోవచ్చనే ఆశలు చిగురించాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొంటున్నారు. మెరుగైన వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ అంశాలతో భారత మార్కెట్ 5 ట్రేడింగ్ సెషన్లలో 4% ర్యాలీ చేసింది’’ అని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సీ తెలిపారు.