కరోన సర్వే.. ఇది చదివితే షాక్ అవుతారు !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోనా బారిన పడిన ప్రతి 8 మందిలో ఒకరిపై ఈ వ్యాధి దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందట. శ్వాసకోస సమస్యలు, నీరస, రుచి, వాసన తెలియకపోవడం వంటి వ్యాధి లక్షణాల్లో కనీసం ఒక్కటైనా వారిని చాలాకాలం బాధిస్తున్నట్టు లాన్సెట్ జర్నల్ విడుదల చేసిన తాజా సర్వే పేర్కొంది. కరోనాపై ఇప్పటిదాకా చేసిన అత్యంత సమగ్రమైన సర్వేల్లో ఇదొకటని చెప్తున్నారు. నెదర్లాండ్స్‌లో 76,422 మందిపై 2020 మార్చి 20 నుంచి 2021 ఆగస్టు దాకా సర్వే జరిపారు. అప్పటికి వ్యాక్సీన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కరోనాకు సంబంధించిన 23 రకాల లక్షణాలపై ఈ వ్యవధిలో వారి నుంచి 24 సార్లు వివరాలను సేకరించారు. 21 శాతం మంది తమకు కరోనా నిర్ధారణ అయిన తొలి 5 నెలల్లో వాటిలో ఒక్కటి, అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపించాయని చెప్పారు.