దేశంలోనే మొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు !
1 min readపల్లెవెలుగువెబ్ : ముంబయిలో దేశంలోనే మొట్టమొదటిసారి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను గురువారం నుంచి నడుపుతున్నారు. మొదటి ఎయిర్ కండీషన్ డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులను బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్ గురువారం ప్రారంభించింది.ముంబయి నగరంలో డబుల్ డెక్కర్ ఏసీ బస్సు, మరో సింగిల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సును అధికారులు ప్రారంభించారు. ఈ బస్సుల ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ లు పాల్గొన్నారు. దేశంలోనే మొదటిసారి ముంబయి నగరంలో రోడ్లపై తిరుగుతున్న బ్లాక్ అండ్ రెడ్ కలర్ డబుల్ డెక్కర్ బస్సు, బ్లూ కలర్ సింగిల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.