భారత్ లోని ఐఫోన్ లవర్స్ కి గుడ్ న్యూస్
1 min readపల్లెవెలుగువెబ్ : భారత్ కేంద్రంగా ఐఫోన్ -14 ఫోన్‌లను తయారీ చేయాలని యాపిల్ సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పలు నివేదికల ప్రకారం..వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి భారత్‌లో ‘మేడిన్ ఇండియా ఫోన్‌ల’ ఉత్పత్తిని ప్రారంభించనుంది. జాతీయ, అంతర్జాతీయ కారణాల వల్ల దేశాల మధ్య ఏర్పడ్డ భిన్నాభిప్రాయాల నేపథ్యంలో యాపిల్ సంస్థ భారత్‌లోనూ ఐఫోన్‌లను తయారు చేయాలని భావిస్తోంది. వాస్తవానికి మన దేశంలో చెన్నై కేంద్రంగా యాపిల్ సంస్థ ఐఫోన్‌లను తయారు చేయిస్తుంది. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడం లేదు. మరికొద్ది రోజుల్లో మార్కెట్‌లో విడుదల కానున్న ఐఫోన్-14సైతం విదేశాల్లో తయారీ చేసి.. అక్కడి నుంచి మనదేశానికి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దిగుమతి సమయం 6 నెలల నుంచి 9నెలల వరకు పట్టేది. తైవాన్ అంశంపై అమెరికా, చైనా మధ్య విభేదాలు, భారత్‌తో చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో రానున్న రోజుల్లో ఐఫోన్‌లను ఆవిష్కరించి.. కొనుగోలు దారులకు చేరేందుకు మరింత సమయం పట్టనుంది.