PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఊరంతా ఒకే బిల్డింగులో నివాసం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఊరంటే ఎన్నో కొన్ని ఇళ్లు, దుకాణాలు, స్కూలు ఇలా ఎన్నో ఉంటాయి. మరిన్ని మౌలిక సదుపాయాలూ ఉంటాయి. కానీ ఓ ఊరు మాత్రం అన్నింటికన్నా చాలా చిత్రంగా ఉంటుంది. వందల్లో జనం ఉంటారు.. పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఆస్పత్రి దాకా అన్ని సదుపాయాలూ ఉంటాయి. కానీ అన్నీ ఒక్క చోటే ఉంటాయి. ఒక్క చోట అంటే.. పక్కపక్కనో, ఎదురెదురుగానో కాదు.. అంతా ఒకే ఒక్క భవనంలో ఉంటాయి. ఇదేదో సరదాకి చెబుతున్నది కాదు. నిజమే. అమెరికాలోని అలాస్కాలో ఉన్న ఆ గ్రామం పేరు విట్టియర్‌. నిత్యం మంచుతో కప్పబడి ఉండే అలాస్కాలోని అంకోరేజ్‌ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో విట్టియర్‌ గ్రామం ఉంటుంది. ఇక్కడ మొత్తం జనాభా 200 అయితే అందులో 180 మంది ఒక్క 14 అంతస్తుల భవనంలోనే నివాసం ఉంటున్నారు. ఆ భవనం పేరు బిగిచ్‌ టవర్స్‌. ఒకప్పుడు ఆర్మీకి చెందినది. చుట్టుపక్కల ఇళ్లు ఉన్నా.. వాటిలో ఉండేది అతి తక్కువ మందే. ఇక్కడ నిరంతరం మంచుతోనే కప్పబడి ఉంటుంది. ప్రజలందరికీ వేర్వేరుగా వేడి సౌకర్యాలు కల్పించడం, రక్షణ సమస్య అని.. ప్రభుత్వం అందరినీ ఒకే భవనంలోకి మార్పించింది. విట్టియర్‌లోని బిగిచ్‌ టవర్స్‌ లోనే చిన్న షాపింగ్‌ మాల్‌, పోస్టాఫీసు, పోలీస్‌ స్టేషన్‌, ఆస్పత్రి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చే టూరిస్టులకు ఇదే భవనంలో బస ఏర్పాట్లు ఉంటాయి.

                                           

About Author