PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు.. ఏసీబీ వ‌ల‌లో అవినీతి చేప‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లాలో ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. స్థలం వివాదంలో బాధితులకు న్యాయం చేస్తానంటూ లంచం డిమాండ్‌ చేసిన సి. బెలగల్ ఎస్సై శివాంజల్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. సిని పక్కీలో జరిగిన ఘటనలో ఇప్పుడు కర్నూలులో చర్చనీయాంశమైంది. కోడుమూరు నియోజకవర్గం, సి బెళగల్ మండలంకు చెందిన ప్రకాష్ ఆచారి అనే వ్యక్తి తన ఇంటి పక్క స్థల వివాదంలో ఈ బెళగల్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. అక్కడ ఎస్సై శివాంజనేయులకు తన సమస్యను వివరించి.. స్థల వివాదాన్ని పరిష్కరించాలని కోరాడు. అందుకు సంబంధించి డాక్యుమెంట్లను చూపారు. అయితే ఆ స్థల వివాదాన్ని పరిష్కరించాలంటే తనకు లక్ష రూపాయలు ఇవ్వాలంటూ లంచం డిమాండ్ చేశాడు. దీంతో కంగు తిన్న ప్రకాష్ ఆచారి ఆ సొమ్ము ఇచ్చేందుకు మొదట నిరాకరించాడు. ఆ తర్వాత విషయాన్ని కర్నూలు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించి వారి దృష్టికి తీసుకెళ్లాడు. అనంతరం ఏసిబి డిఎస్పి శివ నారాయణ స్వామి ఆదేశాల మేరకు సి బెళగల్ ఎస్సై శివ రామాంజనేయులతో మొదట చేసుకున్న ఒప్పందం మెరుపు సొమ్ము ఇచ్చేందుకు అంగీకరించాడు. ఆయా డబ్బును ముట్ట చెప్పడంలో భాగంగా కర్నూలు కలెక్టరేట్, మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు అతి సమీపంలోని మాంటిస్సోరి స్కూలు వద్ద రూ. 50 వేలు ఇచ్చేందుకు బాధితుడు సిద్ధమయ్యాడు. డబ్బు తీసుకొచ్చానంటూ బాధితుడు ఎస్సైని పిలిపించాడు. అక్కడికి వచ్చిన ఎస్ఐ తాను డిమాండ్‌ చేసిన డబ్బు చేతికొస్తుందని సంబర పడుతూ… రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా… అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ పోలీసులు అతను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

                                             

About Author