3న ప్రత్యంగిర దేవి పూజ హోమం..
1 min readపల్లెవెలుగు వెబ్: కొలిచే వారికి కొంగుబంగారంగా వెలుగొందుతున్న శ్రీ ప్రత్యంగిరదేవి అమ్మవారి హోమం.. నవరాత్రోత్సవాలలో భాగంగా దుర్గాష్టమి రోజున భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. రాయచూరులోని తిమ్మాపుర్ పేటలో వెలిసిన శ్రీ బాల మారెమ్మ దేవస్థానం ఆవరణంలో సోమవారం ( అక్టోబరు 3న) శ్రీ శారదాంబ జ్యోతిషాలయ శ్రీ కె. నారాయణ గురుజీ మరియు శిష్యబృందం నేతృత్వంలో ఉదయం 9 గంటల నుంచి హోమం ప్రారంభించనున్నారు. లోకకళ్యాణార్థం శ్రీ ప్రత్యంగిరదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం హోమం కార్యక్రమం చేస్తారు. ప్రత్యంగిర దేవి అమ్మవారికి పూజ, హోమం చేయడం వల్ల సంతానసాఫల్యం, కోర్టు సమస్యల పరిష్కారం, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు తొలగి ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉంటారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని భక్తుల విశ్వాసం. అక్టోబరు 3న జరిగే హోమం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని శ్రీ శారదాంబ జ్యోతిషాలయ శ్రీ కె. నారాయణ గురుజీ ( సెల్నం.9845781066), శిష్య బృందం తెలిపారు.