ఉల్లిపాయలతో మధుమేహ నియంత్రణ
1 min readపల్లెవెలుగువెబ్: అమెరికాలోని శాన్ డియాగోలో ఇటీవల జరిగిన 97వ ది ఎండోక్రైన్ సొసైటీ వార్షిక సమావేశంలో శాస్త్రవేత్తలు ఉల్లిపాయలు, మధుమేహంపై చేసిన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఉల్లిలోని ‘అల్లియమ్ సెపా’ అనే పదార్థం మన రక్తంలో చక్కెర స్థాయిలు 50 శాతం వరకు తగ్గించేందుకు తోడ్పడుతున్నట్టు తాము గుర్తించినట్టు వెల్లడించారు. అంతేగాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచడంలోనూ పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఎలుకలపై పరిశోధన చేశామని శాస్త్రవేత్తలు వివరించారు. మొత్తం నాలుగు గ్రూపులుగా ఎలుకలను తీసుకున్నామని.. అందులో ఒక గ్రూపు మధుమేహం లేని ఎలుకలు అని చెప్పారు. మధుమేహం ఉన్న మూడు గ్రూపుల్లోని ఎలుకలకు.. ఉల్లి నుంచి తీసిన పదార్థాలను వేర్వేరు డోసుల్లో అందించి పరిశీలించామని తెలిపారు.